“కులం వద్దంటూ... కులాన్నే కవచం చేసుకున్నవాడు!”

"కులం వద్దంటూ... కులంతోనే కుర్చీ ఎక్కిన వారూ..!"

కులం వద్దు అంటాడు… కానీ పేదలను వాడుకొని కులంతోనే కవచమై తిరుగుతాడు..!  

ధర్మం వ్యతిరేకమంటాడు… కానీ ధర్మమే తనకు మద్దతుగా వాడుతాడు..!

సమానత్వం అంటూ సభల్లో గళం విప్పుతాడు, కానీ బెనిఫిట్‌ లిస్టు వస్తే ముందే లైన్లో నిలుస్తాడు..!  
నినాదం.. నేను మానవుణ్ని..!.. చర్య.. నా కులం ప్రాధాన్యమని..

సనాతనంపై శపించుకుంటూ తన హక్కులు మాత్రం దానివల్లే పొందుతాడు…  

పాలెగాడు కాకపోయినా పాలెగాడి సౌకర్యం మాత్రం కోరుతాడు..!

మానవత్వం ముఖ్యం.. అంటాడు,. అది చెప్పేటప్పుడు కూడా నా వర్గం అనే మళ్ళీ మైకులో మోగిస్తాడు..!

 సంస్కారం మట్టిపాలు చేస్తూ సంస్కారం పేరుతో అన్నీ అడిగేస్తుంటాడు..!

ఆశ్చర్యం ఏంటంటే..!?.. అతని కాగితం..రిజర్వేషన్.. తో కప్పబడి ఉంటుంది,. కానీ అతని ప్రసంగం.. రివల్యూషనతో నిండి ఉంటుంది..!

వాదమంటే శబ్దం, కానీ సాధనలో లాభం..!  
సనాతనం అంటే వెనుకబాటు అంటాడు, కానీ ఆ సనాతనమే ఇచ్చిన నీతి మరిచిపోతాడు..!

కులం వద్దు అన్నవాడు కులంతోనే రిజర్వ్ అయ్యాడు..!

 ధర్మం వెనుకబడిందన్న వాడు ధర్మం ఇచ్చిన చట్టాలతోనే ముందుకు నడిచాడు..!

సనాతనం నశించదయ్యా… సత్యం నిలిచినంతవరకు, నాటకం ఆడేవారు ఎన్ని మారినా... నిజం మాత్రం ఎప్పుడూ తలవంచదు..! 

ధర్మం ముందు అధర్మం గలవాడు.. ఎల్లప్పుడూ అందరి దగ్గర నటిస్తూ ఎల్లప్పుడూ అన్యాయమే కలిగిన వాడు ఎప్పుడూ తలవంచాల్సిందే అని మాత్రం ఓ గొప్ప మానవత్వం కలిగిన భారతీయుడిగా తెలుసుకోలేడు..! 
.......రచయిత వండాన కూర్మారావు పాలకొండ

Post a Comment

1 Comments