వెనుకబాటుపై ఆవేదన
పాలకొండ ప్రాంతం సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా వెనుకబడిపోయిందని సమావేశంలో పాల్గొన్న పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధి చాలా తక్కువగా ఉందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత వెనుకబడిపోతామని హెచ్చరించారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళం తమకు దగ్గరగా ఉందని, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కంటే శ్రీకాకుళంలో కలపడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయంపై నిరాశ
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాలకొండకు జిల్లా హోదా దక్కే అవకాశం లేదని తెలియడంతో సమితి సభ్యులు, ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ, ఎట్టి పరిస్థితుల్లోనూ పాలకొండను జిల్లాగా చేయాలనే డిమాండ్‌పై వారు దృఢంగా ఉన్నారు. పాత డివిజన్‌ను కొనసాగించి పాలకొండ జిల్లా చేయాలనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేశారు.
సాధన సమితి కార్యాచరణ
గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు
మరియు కార్యవర్గం ప్రతి నెలా సమావేశమై ఈ విషయాలపై చర్చించి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులను, మంత్రులను, జిల్లాల పునర్విజన. సబ్ కమిటీకి కలిసి వినతులు సమర్పించినప్పటికీ, సానుకూల స్పందన రాకపోవడంపై ఆవేదన చెందారు.పాలకొండకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ, తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు త్వరలో కార్యాచరణ కూడా ప్రారంభిస్తామని పాలకొండ జిల్లా సాధన సమితి తెలిపింది.పాలకొండ ప్రజల ఈ మనోభావాలను ప్రభుత్వం మరియు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు, పాలకొండ జిల్లా సాధన సమితి తదుపరి కార్యాచరణ రూపొందిస్తుంది.మంగళవారం జరిగిన సుదీర్ఘ సమావేశంలో గౌరవ అధ్యక్షులు కనపాక చౌదరి నాయుడు, అధ్యక్షులు బుడితి అప్పల నాయుడు, ట్రెజరర్ సబ్బ నానాజీ, కార్యదర్శి వండాన కూర్మారావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరు సత్యనారాయణతో పాటు తుమ్మగుంట శంకరరావు, కడగల వెంకట రమణ, రుంకు రామకృష్ణ, కిల్లారి విజయ్ కుమార్, నెల్లి సత్యం నాయుడు, గిరడ రాము, రుద్ర కోటేశ్వరరావు, గిరడ లక్ష్మణరావు, కడగల భాను, జడ్డు బాలరాజు, బెజ్జపురం చిన్నమనాయుడు, ఎందవ రాధాకృష్ణ, బుక్కూరు కృష్ణారావు, అల్లిన శ్రీనివాసు, కిల్లారి మోహన రావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తరువాయి భాగం రేపటి
పాలకొండ వెబ్ న్యూస్ లో
1 Comments
Super 💯
ReplyDelete