అబ్దుల్ కలాం – కలల సాకారానికి ప్రతీక


డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం జన్మదినం ప్రతి భారతీయుడికీ ప్రేరణాత్మకం. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరం అనే చిన్న పట్టణంలో సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో పత్రికలు అమ్ముతూ విద్య కొనసాగించిన కలాం గారు పట్టుదలతో చదివి, ఇంజినీరింగ్‌లో బి.టెక్ పూర్తి చేశారు. అనంతరం భారత రక్షణ పరిశోధనా సంస్థ (DRDO) మరియు అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)ల్లో శాస్త్రవేత్తగా సేవలు అందించారు.

భారతదేశాన్ని క్షిపణి సాంకేతికతలో ముందుకు తీసుకెళ్లినందుకు ఆయనకు “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా” అనే బిరుదు లభించింది. ఆయన నాయకత్వంలో “అగ్ని”, “పృథ్వీ” క్షిపణులు విజయవంతమయ్యాయి. 2002లో ఆయన భారత రాష్టప్రతిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ప్రజల మనసుల్లో ప్రజాప్రియ అధ్యక్షుడిగా నిలిచారు.

జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా, తన కలలను వదలలేదు. “కష్టాలు మన బలాన్ని పెంచుతాయి” అనే ఆయన మాటలు ప్రతి యువకుడికి మార్గదర్శకం. సులభ జీవితం, స్వచ్ఛమైన ఆలోచనలు, దేశాభిమానం ఆయన వ్యక్తిత్వానికి మూలాధారం.

2015లో షిల్లాంగ్‌లో విద్యార్థులతో మాట్లాడుతూ చివరి శ్వాస విడిచారు. ఆయన జీవితం విద్యార్థులందరికీ ఒక అగ్నిజ్యోతి — కలలు కనండి, కృషి చేయండి, దేశాన్ని గర్వపడేలా చేయండి. అదే కలాం గారికి నిజమైన గౌరవం.

... బి. శివశంకర్ ప్రసాద్

Post a Comment

2 Comments

  1. Santosh Kumar Vandranki14 October 2025 at 20:51

    Nice article, inspiration personality for upcoming youth

    ReplyDelete