పాలకొండలో సైఫోన్ సమస్యపై పూర్తి స్థాయి మరమ్మత్తులు జరపాలి


యాలం జంక్షన్ వద్ద రహదారి దయనీయ పరిస్థితిపాలకొండ వెబ్ న్యూస్, అక్టోబర్ 12:

పాలకొండ యాలం జంక్షన్ సమీపంలోని సైఫోన్ దశాబ్దాల నుండి సమస్యగా మారింది. సైఫోన్‌లో మట్టి, బురద పేరుకుపోవడంతో చిన్నపాటి వర్షం పడినా నీరు రోడ్డుపైకి ప్రవహిస్తూ రోడ్డు దెబ్బతింటోంది. సుమారు అర కిలోమీటరు మేర తారు రోడ్డు పైకి ఈ నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతి వర్షానికీ ఈ మార్గం తడిసిముద్దవుతోందని, రహదారిపై ప్రయాణం సాహసయాత్రగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని స్థానికుడు సురవరపు కృష్ణారావు తన సొంత ఖర్చుతో ఇంజిన్ ఏర్పాటు చేసి సైఫోన్‌లోని మట్టి, బురద తొలగించి తాత్కాలిక మరమ్మత్తులు నిర్వహించినట్లు తెలిపారు.

అయితే, ఇది తాత్కాలిక పరిష్కారమేనని, సైఫోన్‌కు పూర్తి స్థాయి మరమ్మత్తులు అత్యవసరమని ప్రజలు సూచిస్తున్నారు. చిన్న వర్షం పడినప్పటికీ యాలం జంక్షన్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్, పాలకొండ ప్రధాన మెయిన్ రోడ్, గ్రామీణ బ్యాంక్ వరకు నీరు ప్రవహించడం రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. వర్షాకాలంలో రోడ్డుపై చిన్నపాటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.

స్థానికులు ..సంబంధిత అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని, సైఫోన్ మరమ్మత్తులు శాశ్వతంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. లేకపోతే, రాబోయే రోజుల్లో కోట్లాది రూపాయల విలువ గల తారు రోడ్డు పూర్తిగా పాడైపోయే అవకాశము ఉన్నది.

Post a Comment

1 Comments