పాలకొండ వెబ్ న్యూస్ : ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలను పురస్కరించుకుని ఈరోజు గాయత్రి నర్సింగ్ కాలేజీలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అత్యంత కీలకమైన అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం (DMHP) టీం సైకియాట్రిక్ కౌన్సిలర్ కె.కృష్ణారావు విద్యార్థులలో స్ఫూర్తి నింపారు. ఆయన మాట్లాడుతూ, "మానసిక ఆరోగ్యం మన జీవితానికి అత్యంత ముఖ్యం. మంచి అలవాట్లే మానసిక ఆరోగ్యానికి ఆయుధాలు." అని శక్తివంతమైన సందేశాన్ని అందించారు.
ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో కూడా మనసును దృఢంగా ఉంచుకోవాలంటే మంచి అలవాట్లు, సంతృప్తికరమైన జీవన విధానం కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేస్తూ, మనోధైర్యాన్ని పెంచే సూచనలు, సలహాలు ఇచ్చారు.
మానసిక సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న టెలి మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కృష్ణారావు గారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ రావు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.
News by : BSS Prasad

1 Comments
very nice programme
ReplyDelete