పాలకొండ వెబ్ న్యూస్ - ప్రత్యేక ఇంటర్వ్యూపాలకొండ నగర పంచాయతీ సమగ్రాభివృద్ధికి కృషి: కమిషనర్ జే వి ఎస్ రత్నరాజు


 పాలకొండ వెబ్ న్యూస్ - ప్రత్యేక ఇంటర్వ్యూ
పాలకొండ నగర పంచాయతీ సమగ్రాభివృద్ధికి కృషి: కమిషనర్ జే వి ఎస్  రత్నరాజు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ మరియు
పాలకవర్గం,  సహాయ సహకారాలతో పాలకొండ ప్రగతిపథంలో నడుస్తుంది - డంపింగ్ యార్డుకు నివేదిక, ఆక్రమణలపై కఠిన చర్యలు: కమిషనర్ రత్నరాజు
పాలకొండ, (నవంబర్ 4):
పాలకొండ నగర పంచాయతీ సమగ్రాభివృద్ధికి పాలకవర్గం మరియు స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) సహకారంతో కృషి చేస్తామని పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ రత్నరాజు పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగున్నర సమయంలో పాలకొండ వెబ్ న్యూస్ మరియు కళాభారతి మాస పత్రికకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.
డంపింగ్  యార్డ్ పై నివేదిక
కమిషనర్ రత్నరాజు మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ కు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడానికి వీలుగా స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు ఒక నివేదిక అందజేశామని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగానే డంపింగ్ యార్డ్ కు రూపకల్పన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
శానిటేషన్ & డస్ట్ బిన్లు
శానిటేషన్ గురించి మాట్లాడుతూ, తాను ప్రతిరోజు ఉదయం స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్య ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. డస్ట్ బిన్ల గురించి అడగగా, 25 డస్ట్ బిన్లకు ఆర్డర్ చేశామని, అందులో 15 డస్ట్ బిన్లు వచ్చాయని, మిగతా వాటిని కూడా త్వరలో తెప్పిస్తామని హామీ ఇచ్చారు.
ఆక్రమణలపై కఠిన వైఖరి
నగరంలో ఆక్రమణల గురించి ప్రస్తావించినప్పుడు కమిషనర్ కఠినంగా స్పందించారు. తాను నగర పంచాయతీ కమిషనర్ గా తీసుకున్న  తర్వాత ఆక్రమణలను పూర్తిగా నియంత్రణ చేశామని, ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని చెప్పారు. ఇటీవల బంగారు కోనేరు కొత్త వీధిలోను, కళ్యాణి కోనేరు వద్ద ఆక్రమణలను ఆపమని చెప్పామని, నగర పంచాయతీ ఒక స్థలాలు ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఆక్రమణ చేసిన వారిపై తగు చర్యలు చేపట్టక తప్పదని ఆయన స్పష్టం చేశారు.
మంచినీటి కుళాయిల ద్వారా బురద నీరు రావడం పై ఆయన స్పందిస్తూ సంకిలి వద్ద ఉన్న  పంపింగ్ సిస్టం వద్ద వర్షాలు పడినప్పుడు మీరు ఈ పంపింగ్ సిస్టం పైనుంచి నీరు పారడం వల్ల ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. .
ఎస్సీ, ఎస్టీ నిధులు
ఎస్సీ, ఎస్టీ నిధులకు సంబంధించి రూ. 2.50 కోట్ల వర్క్ ప్రపోజల్ పెట్టామని, నిధులు వచ్చిన వెంటనే సంబంధిత పనులు నగర పంచాయతీలో చేపడతామని కమిషనర్ రత్నరాజు తెలిపారు.
ముఖ్యంగా ఆక్రమణలపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నగర పంచాయతీ సమగ్రాభివృద్ధికి పాలకవర్గంతో పాటు స్థానిక శాసనసభ్యులు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాలకొండను ప్రగతి పదం లో నడిపించడానికి తనవంతు కృషి చేస్తానని పాలకొండ వెబ్ న్యూస్ కు ఇంటర్వ్యూలో చెప్పారు.
           News by : BSS Prasad

Post a Comment

1 Comments