మనసులో మనసువై... (నవజీవితం)​ రచన: అల్లెన కాశీ దాస్

మనసులో మనసువై మైమరపించే నా సఖి
తనువులో తనువువై నడిపించే నా సఖా
మనకిదే నవజీవితం
ప్రతిదినం మధురామృతం. మనసులో మనసువై మైమరపించే నా సఖి
తనువులో తనువువై నడిపించే నా సఖా
మనకిదే నవజీవితం
ప్రతిదినం మధురామృతం

నీ చూపే చినుకై నన్ను తడిపెనే
నీ మాటే మధువై హృదయం నింపెనే
నీతోనే ప్రతి వేళ వెలుగై నిలిచెనే
నీ నవ్వే నా లోకం పూలై విరిసెనే

వెన్నెలై వచ్చావు నా కలల వీధిలో
వేణువై మారావు నా మౌన గీతిలో
చేతిలో చేయివై నడిచే బాటలో
కాలమే ఆగెనో ప్రేమ జాడలో
మనసులో మనసువై తనువులో తనువువై.                                                  
జీవితం జలపాతమై ప్రేమగా పారెనే
లలలలా లలలలా హహహహా హహహహా లలలలా లలలలా హహహహా హహహహా

.......రచన .. అల్లెన కాశీ దాస్.

Post a Comment

2 Comments

  1. అద్భుతంగా రాశారు 👌
    చాలా భావోద్వేగంగా, హృదయానికి తాకేలా ఉంది 😊

    ReplyDelete