లలిత త్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయ స్వామి వారికి ఆదివారం ప్రదోష పూజ

​పాలకొండ వెబ్ న్యూస్, 21 జూన్ 2026: స్థానిక ఆలయంలో శ్రీ లలిత త్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయ స్వామి వారికి ఆదివారం ప్రదోష పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ప్రదోష కాల విశేష సమయాన్ని పురస్కరించుకుని స్వామి వారి శివలింగాన్ని విభూతి రేఖలతో మరియు పచ్చని త్రిపుండ్రంతో నయనానందకరంగా తీర్చిదిద్దారు. పానవట్టం వద్ద, నాగాభరణంపై గులాబీ రంగు తామర పుష్పాలను విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. లింగం చుట్టూ సన్నజాజి పూలు తో  అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ దివ్యమైన ఆధ్యాత్మిక పూజా కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

1 Comments

  1. Great job Sir 👏 keep posting for ever

    ReplyDelete