పాలకొండ రాజకీయంలో తీవ్ర ఉత్కంఠ: కూటమి సీటు జనసేనకే..!

​పాలకొండ వెబ్ న్యూస్.. పాలకొండ నగర పంచాయతీ కి మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజకీయం తీవ్ర వేడెక్కింది. ఒకవైపు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇప్పటికే తమ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులను ఖరారు చేసి, విజయమే లక్ష్యంగా ధీమాతో ప్రచారంలో ముందుకు సాగుతోంది. మరొకవైపు అధికార కూటమిలో చైర్‌పర్సన్ అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీకి కేటాయించినప్పటికీ, సరైన అభ్యర్థి ఎంపికపై ఇంకా తీవ్ర సందిగ్ధత కొనసాగుతోంది. సామాజిక వర్గాల సమీకరణాల దృష్ట్యా కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి రావడంతో పాటు, స్థానిక కీలక నేతల కుటుంబ సభ్యుల పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. సీట్ల కేటాయింపుల్లో అసంతృప్తి చెంది కండువాలు మార్చే నాయకులు, తిరుగుబాటు అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలోకి దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Post a Comment

1 Comments